సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2017 (08:56 IST)

రాజకీయాల్లో రాణించాలంటే కీర్తి, ఐశ్వర్యం సరిపోవు.. ఇంకేదో కావాలి!

రాజకీయాల్లో రాణించాలంటే కీర్తి, ఐశ్వర్యం సరిపోవనీ, ఇంకేదో కావాలనీ, కానీ, అదేంటో తనకు తెలియదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. చెన్నైలో ప్రముఖ సినీనటుడు శివాజీ గణేశన్‌ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం సందర

రాజకీయాల్లో రాణించాలంటే కీర్తి, ఐశ్వర్యం సరిపోవనీ, ఇంకేదో కావాలనీ, కానీ, అదేంటో తనకు తెలియదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. చెన్నైలో ప్రముఖ సినీనటుడు శివాజీ గణేశన్‌ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ, రాజకీయ నాయకుడిగా విజయం సాధించాలంటే ఇప్పుడున్న కీర్తి ప్రతిష్టలు సరిపోవని అన్నారు. 
 
అంతకంటే ఎక్కువ కావాలని, ఆ కావాల్సినవి ఏంటో తనకు తెలియదని ఆయన చెప్పారు. ఆ రహస్యం సహచరుడు కమల్ హాసన్‌కు తెలుసని భావిస్తున్నానని రజనీకాంత్ తెలిపారు. రెండు నెలల క్రితమే కమల్ హాసన్ తనతో కలిసి పనిచేయాలని అడిగి ఉండాల్సిందని ఆయన చెప్పారు. తాను మాత్రం రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలని కమల్‌ను అడిగానని ఆయన అన్నారు. అప్పుడు కమల్ తనతో వస్తే చెబుతానన్నారని ఆయన తెలిపారు. 
 
శివాజీగణేశన్‌ జయంతి సందర్భంగా జరిగిన ఈ వేడుకలో రజనీ చేసిన వ్యాఖ్య లు చర్చనీయాంశమయ్యాయి. కట్టబ్రహ్మన వంటి స్వాతంత్య్ర సమరయోధులను తన నటనద్వారా మన కళ్లముందుంచిన మహానటుడు శివాజీ అని రజనీ కొనియాడారు. కానీ ఆయన తన సొంత నియోజకవర్గంలో పరాజయం పొందడం బాధాకరమని, ఆ ఓటమి ఆ నియోజకవర్గ ప్రజలకే అవమానకరమన్నారు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే కీర్తిప్రతిష్టలు, ఐశ్వరం సరిపోవన్నారు. కమల్‌ రాజకీయాల్లోకి ప్రవేశించాలని చూస్తున్న నేపథ్యంలో రజనీ ఓ రకంగా పరిహాసంగా ఈ వ్యాఖ్యలు చేశారు.