బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

గొంతెత్తితే కాల్చేస్తారా? అరవింద్ స్వామి ప్రశ్న

హిందూ తీవ్రవాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హీరో కమల్ హాసన్‌ను కాల్చి చంపాలి లేదా ఉరి తీయాలంటూ హిందూ మహాసభ నేత చేసిన వ్యాఖ్యలను మరో హీరో అరవింద్ స్వామి ఖండించారు.

హిందూ తీవ్రవాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హీరో కమల్ హాసన్‌ను కాల్చి చంపాలి లేదా ఉరి తీయాలంటూ హిందూ మహాసభ నేత చేసిన వ్యాఖ్యలను మరో హీరో అరవింద్ స్వామి ఖండించారు. ఈ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. గొంతెత్తితే కాల్చేస్తారా అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై "రోజా" చిత్రం హీరో అరవింద్ స్వామి స్పందిస్తూ, 'ప్రశ్నిస్తే, జాతి వ్యతిరేకులమంటూ జైల్లో వేయాలంటున్నారు. ఒకవేళ జైళ్లు ఖాళీ లేకపోతే కాల్చి చంపేయాలనే కొత్త ఫ్యాషన్‌ మొదలైంది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పైగా, 'చట్టవిరుద్ధంగా బెదిరింపులకు పాల్పడేవారిని, హింసకు పాల్పడేవారిని తీవ్రవాదులుకాక మరేమంటారు?' అంటూ హీరో కమల్‌కు అండగా నిలిచారు. అలాగే, 'మెర్సల్‌' చిత్రానికీ మద్దతు పలికారు. ఏకీకృత పన్నువల్ల కలిగే లాభనష్టాలపై కేంద్రాన్నికాకుండా ఇంకెవ్వరిని నిలదీయాలి? అంటూ ప్రశ్నించారు.