సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 10 నవంబరు 2017 (16:48 IST)

జగన్‌లో ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి... ఏపీ ఆర్థిక మంత్రి

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ఫైరయ్యారు ఎపి ఆర్థిక శాఖామంత్రి యనమల రామక్రిష్ణుడు. జగన్ పిల్ల బచ్చా అనీ, ఆయనకు రాజకీయాలంటే ఏమీ తెలియదని, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి జగన్‌కు లేదని మండిపడ్డారు. కడప జిల్లా పాదయాత్రలో జగన్ ముఖ్యమంత్రిని ఉద్

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ఫైరయ్యారు ఎపి ఆర్థిక శాఖామంత్రి యనమల రామక్రిష్ణుడు. జగన్ పిల్ల బచ్చా అనీ, ఆయనకు రాజకీయాలంటే ఏమీ తెలియదని, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి జగన్‌కు లేదని మండిపడ్డారు. కడప జిల్లా పాదయాత్రలో జగన్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో యనమల కూడా ఫైరయ్యారు.
 
రాజకీయాలను అవపోసన పట్టిన చంద్రబాబు లాంటి ఉద్దండుడిని విమర్శించే స్థాయి జగన్‌కు లేదన్నారు యనమల. విదేశాల్లో జగన్‌కు నల్లధనం ఉన్నమాట వాస్తవమేనని, దాన్ని నిరూపించాల్సిన అవసరం తమకు లేదని ఇదంతా ప్రజలకు తెలుసునన్నారు యనమల రామక్రిష్ణుడు. యనమల కామెంట్స్ పైన వైసిపి నేతలు కూడా భగ్గమంటున్నారు.