శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 4 అక్టోబరు 2017 (17:56 IST)

తమిళనాడు సిఎంకు తిరుమలలో అవమానం... బాబుకు చెపుతాం...

తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామికి తిరుమలలో తీవ్ర అవమానం జరిగింది. శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమలకు వచ్చిన పళణిస్వామిని టిటిడి ఘోరంగా అవమానించింది. ఎమ్మెల్యేకు ఇచ్చే మర్యాదలను మాత్రమే సిఎంకు చేసింది. తమిళనాడు సిఎం అంటే అంత అగౌరవమా అంటూ అన్నాడిఎంకే న

తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామికి తిరుమలలో తీవ్ర అవమానం జరిగింది. శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమలకు వచ్చిన పళణిస్వామిని టిటిడి ఘోరంగా అవమానించింది. ఎమ్మెల్యేకు ఇచ్చే మర్యాదలను మాత్రమే సిఎంకు చేసింది. తమిళనాడు సిఎం అంటే అంత అగౌరవమా అంటూ అన్నాడిఎంకే నేతలు టిటిడి తీరుపై మండిపడుతున్నారు.
 
నిన్న కుటుంబ సమేతంగా ఉదయం పళణిస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు. సిఎంకు టిటిడి ఈఓ గాని, లేకుంటే జెఈఓలు గాని తీర్థప్రసాదాలు ఇవ్వాలి. అలాంటిది ఆలయ డిప్యూటీ ఈఓ ప్రసాదాలు ఇచ్చారు. అంతేకాదు ప్రోటోకాల్ ప్రకారం సిఎంకు టిటిడి ముద్రించిన క్యాలెండర్, డైరీ, స్వామివారి ఫోటో ఇవ్వాలి. అలాంటిది ఒకే ఒక్క ఫోటో ఇచ్చి అగౌరవపరిచింది. పళణిస్వామి ఆలయంలో ఉండగానే భక్తులను దర్శనానికి అనుమతించేశారు. సిఎం వెంట టిటిడి ఉన్నతాధికారులెవరూ లేరు. 
 
తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సిఎంను టిటిడి ఉన్నతాధికారులు చాలా చిన్నచూపు చూశారని తమిళనాడుకు చెందిన అన్నాడిఎంకే నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు అన్నాడిఎంకే నేతలు.