ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By tj
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2017 (15:40 IST)

స్వామీ... మా ప్రభుత్వాన్ని కాపాడంటున్న పన్నీర్ సెల్వం (Video)

తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి సేవలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో ఉండటంతో పన్నీరుసెల్వం తిరు

తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి సేవలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో ఉండటంతో పన్నీరుసెల్వం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
 
పన్నీరుసెల్వం వెంట కొంతమంది అన్నాడీఎంకే సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గత కొన్నిరోజులుగా తమిళనాడులో ప్రశాంత వాతావరణం కనిపించడంతో పన్నీరుసెల్వం నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి కూడా దర్శించుకోనున్నారు.