జయలలిత అపోలోలో ఇడ్లీ సాంబార్ తిన్నారు.. పేపర్ చదువుతున్నారు.. ఇవన్నీ అబద్ధాలే: శ్రీనివాసన్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. ఆమెను చూసేందుకు ఎవ్వరినీ అనుమతించలేదు. గత ఏడాది సెప్టెంబరు 22న ఆసుపత్రిలో చేరి, ఆ తరువాత డిసెంబర్ 5న గుండెపోటుతో జయల
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. ఆమెను చూసేందుకు ఎవ్వరినీ అనుమతించలేదు. గత ఏడాది సెప్టెంబరు 22న ఆసుపత్రిలో చేరి, ఆ తరువాత డిసెంబర్ 5న గుండెపోటుతో జయలలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత దిండుగల్ శ్రీనివాసన్ అమ్మ ఆరోగ్యానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమ్మ నెచ్చెలి శశికళకు భయపడి తాము జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అసత్యాలు పలికామన్నారు. జయలలిత మృతికి శశికళ కుటుంబమే కారణమని బాంబు పేల్చారు. ఆసుపత్రిలో ఉన్న జయలలితను శశికళ బంధువులు చూడనివ్వలేదని అసలు విషయాలు నోరు విప్పి చెప్పేశారు. శశికళ వర్గానికి భయపడే.. తాము జయలలిత అనారోగ్యం గురించి పచ్చి అబద్ధాలు చెప్పామన్నారు.
ఆస్పత్రిలో అమ్మ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని.. ఆమె సాంబార్ ఇడ్లీ తిన్నారని, పేపర్ చదువుతున్నారని చెప్పిందంతా అసత్యాలేనని దిండుగల్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అమ్మను ఆస్పత్రిలో ఎవ్వరూ చూడలేదని.. శశికళ బంధువులు ఓ గదిలో కూర్చోబెట్టి మాట్లాడి అందరినీ పంపించేవారని శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు. అమ్మ ఆరోగ్య పరిస్థితి పట్ల అసత్యాలు చెప్పినందుకు.. శశికళ గురించి నిజాలు చెప్పనందుకు తనను ప్రజలు క్షమించాలని కోరారు.