బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (11:43 IST)

తమిళ రాజకీయాల్లో కుదుపు.. టీటీవీ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

తమిళ రాజకీయాలు మరోమారు భారీ కుదుపునకు లోనయ్యాయి.

తమిళ రాజకీయాలు మరోమారు భారీ కుదుపునకు లోనయ్యాయి. ఈ కుదుపు అధికార అన్నాడీఎంకేలో మరో సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామికి వ్యతిరేకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో 18 మందిపై ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పి.ధనపాల్ అనర్హత వేటువేశారు. స్పీకర్ నిర్ణయంతో పళనిస్వామి ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్టయింది. 
 
మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపినందుకు ముఖ్యమంత్రి పళనిస్వామిపై టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. వీరిలో 21 మంది ఎమ్మెల్యేలు తాత్కాలిక గవర్నర్ సీహె.విద్యాసాగర్ రావును కలిసి సీఎంకు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఫిర్యాదు చేశారు. 
 
ఈ వ్యవహారాన్న సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వ విప్ గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీచేసి వివరణ కోరారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక గవర్నర్ సోమవారం చెన్నైకు రానున్నారు. ఇలాంటి తరుణంలో స్పీకర్ ధనపాల్ 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఆదేశారు జారీ చేశారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.