శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (16:39 IST)

పంతులు చెప్పాడని.. ఇద్దరు యువతుల్ని ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. చివరికి?

జాతకం ప్రకారం ఇద్దరు భార్యల యోగం వుందని జ్యోతిష్యులు చెప్పడంతో.. అతడు ఇద్దరు యువతుల్ని ఒకేసారి వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. కానీ ఇంతలో సీన్ రివర్సైంది. వివరాల్లోకి వెళితే.. త‌మిళ‌నాడులోని విరుధ్

జాతకం ప్రకారం ఇద్దరు భార్యల యోగం వుందని జ్యోతిష్యులు చెప్పడంతో.. అతడు ఇద్దరు యువతుల్ని ఒకేసారి వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. కానీ ఇంతలో సీన్ రివర్సైంది. వివరాల్లోకి వెళితే.. త‌మిళ‌నాడులోని విరుధ్‌న‌గ‌ర్ జిల్లాలో ఎం వెల్ల‌య‌పురం గ్రామానికి చెందిన 31 ఏళ్ల రామమూర్తి ఒకేసారి ఇద్దరు యువతుల్ని వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. 
 
ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామమూర్తికి చుక్కలు కనిపించాయి. ఇద్దరు భార్యల యోగం వుందని జ్యోతిష్యులు చెప్పడంతో తన మేనకోడళ్ళను ఒకే వేదికపై వివాహం చేసుకునేందుకు రామమూర్తి సిద్ధమయ్యాడు. 
 
పెళ్ళి ముహూర్తం దగ్గరపడే కొద్దీ.. వివాహ పత్రిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పెళ్లికి పోలీసులు అడ్డుతగిలారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. అమ్మాయిల తల్లిదండ్రుల వద్ద జరిపిన విచారణలో రామమూర్తి జాతకం ప్రకారం అతనికి ఇద్దరు భార్యల యోగం వుందని చెప్తే రేణుకాదేవి (21), గాయత్రి (20)లను ఇచ్చి వివాహం చేసేందుకు ఒప్పుకున్నామన్నారు. ఆపై పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి రేణుకాదేవితో మాత్ర‌మే రామమూర్తి వివాహం జ‌రిపించాలన్నారు. అందుకు అందరూ అంగీకారం తెలిపారు.