గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (16:13 IST)

నోరుందనీ పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు : మిల్కీబ్యూటీ (Dance rehearsal video)

మిల్కీబ్యూటీ తమన్నా వేదాంత ధోరణితో మాట్లాడుతోంది. దేవుడు నోరిచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదంటూ సలహా ఇస్తోంది. మన పెద్దలు 'కష్టే ఫలి' అన్నారు కదా అని అడిగితే.. మోడ్రన్‌ డేస్‌లో దానికి ఇంకొకట

మిల్కీబ్యూటీ తమన్నా వేదాంత ధోరణితో మాట్లాడుతోంది. దేవుడు నోరిచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదంటూ సలహా ఇస్తోంది. మన పెద్దలు 'కష్టే ఫలి' అన్నారు కదా అని అడిగితే.. మోడ్రన్‌ డేస్‌లో దానికి ఇంకొకటి ఖచ్చితంగా తోడవ్వాల్సిందే అంటున్నారు. ముందుగా మన ప్రవర్తన, వ్యవహరించే తీరు మంచిగా ఉండాలని హితవు పలుకుతోంది. 
 
ముఖ్యంగా లౌక్యం. జీవితంలో ఎవరికైనా లౌక్యం తెలియాలి. ఎక్కడ ఎంతవరకు మాట్లాడితే బావుంటుందో అంతే మాట్లాడాలంటోంది. అంతేగానీ దేవుడు నోరు ఇచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు. నా దృష్టిలో మాటకు చాలా విలువ ఉంటుంది. పలికే ప్రతి మాటను లౌక్యంగా పలకాలి. నేను ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతుంటాను. ఈ పద్ధతి వల్ల చాలావరకు సమస్యల నుంచి బయటపడగలుగుతున్నాను. కావాలంటే ఎవరైనా ప్రయత్నించి చూడొచ్చు అని సలహా ఇచ్చింది. 
 
కాగా, ఈ భామ ఓ బాలీవుడ్ మూవీ కోసం హీరోతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి.