విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)
తిరుమలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి తిరుమల మాధవరం గెస్ట్ హౌస్ ఎదురుగా నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్సు డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబు స్క్వాడ్ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. ఈ దాడి దృశ్యాలు ఎలక్ట్రిక్ బస్సులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఈ దాడి ఘటనను ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. విధుల్లో ఉన్న డ్రైవర్‌పై దాడి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింద. ఈ దాడిపై తిరుమల రెండో పట్టణ పోలీసలకు ఆర్టీసీ డ్రైవర్, యూనియన్ నాయకులు ఫిర్యాదు చేశారు.
తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2025
మంగళవారం రాత్రి తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సునిలిపి ఉండగా జరిగిన ఘటన
అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్సు డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి
ఎలక్ట్రికల్ ఏసీ బస్సు సీసీటీవీ కెమెరాల్లో… pic.twitter.com/WevAB2sj3h
