శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:44 IST)

ఎన్టీఆర్ 'బిగ్ బాస్'... వామ్మో వాళ్లని చూళ్లేక చస్తున్నాం... మాకో హాటీ కావాలి టైగరో...

బిగ్ బాస్... ఒక్కో భాషలో ఒక్కో రకంగా ముందుకు వెళుతోంది. తమిళంలో కమల్ హాసన్ తనదైన మార్కుతో ముందుకు తీసుకువెళుతున్నారు. ఇక్కడ ఒవియా ఇష్యూ బ్లాస్ట్ అయి ఏదో కాస్త పబ్లిసిటీ వచ్చేసింది. ఇక ఇక్కడ ఎవరికివాళ్లు ఒవియా మాదిరిగా పిల్లిమొగ్గలు వేసేందుకు ట్రై చేస

బిగ్ బాస్... ఒక్కో భాషలో ఒక్కో రకంగా ముందుకు వెళుతోంది. తమిళంలో కమల్ హాసన్ తనదైన మార్కుతో ముందుకు తీసుకువెళుతున్నారు. ఇక్కడ ఒవియా ఇష్యూ బ్లాస్ట్ అయి ఏదో కాస్త పబ్లిసిటీ వచ్చేసింది. ఇక ఇక్కడ ఎవరికివాళ్లు ఒవియా మాదిరిగా పిల్లిమొగ్గలు వేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇకపోతే తెలుగు బిగ్ బాస్ వ్యవహారం మరోలా వుంది. 
 
ఇక్కడి షో అంతా చప్పగా వుందని ప్రేక్షకులు మెయిళ్లు పెడుతున్నారట. ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రమే సూపర్ రేటింగ్సుతో ముందుకు వెళుతున్న బిగ్ బాస్ ఆ తర్వాత చప్పగా మారిపోతోందట. పైగా పార్టిసిపెంట్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నారనీ, దీక్షా పంత్ వచ్చినా తమకు అంతగా హాటెస్ట్ అందాలు సరిపోవడం లేదంటూ కొందరు వీక్షకులు కామెంట్లు పెడుతున్నారట. దీనితో నిర్వాహకులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. 
 
ప్రస్తుతం ఓ టాప్ హీరోయిన్ ను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇప్పించే పనిలో వున్నట్లు సమాచారం. ఈరోజే రేపో ఆమె ఎంట్రీ ఇచ్చే అవకాశం వుందని అనుకుంటున్నారు.