గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 22 జులై 2017 (21:50 IST)

అది నచ్చితేనే షాట్ ఓకే అంటుందట తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్. కొన్నిరోజుల పాటు అగ్రహీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు తమన్నా. బాహుబలి తరువాత తమన్నా క్రేజ్ మరింత పెరిగింది. ఏ క్యారెక్టరయినా

మిల్కీ బ్యూటీ తమన్నా. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్. కొన్నిరోజుల పాటు అగ్రహీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు తమన్నా. బాహుబలి తరువాత తమన్నా క్రేజ్ మరింత పెరిగింది. ఏ క్యారెక్టరయినా అవలీలగా చేసే తమన్నా ఆ విషయంలో మాత్రం నిత్య విద్యార్థే అంటోంది. అదే నటించేటప్పుడే. అది ఎలాంటి క్యారెక్టరయినా.. గతంలో చేసిన క్యారెక్టరయినా అది చేస్తున్నప్పుడు ఇంకా బాగా నేర్చుకోవాలన్న ఉద్దేశం తమన్నాకు ఎప్పుడు ఉంటుందట.
 
దర్సకుడు ఎప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పినా వాటి గురించి కనుక్కునే ప్రయత్నం చేస్తుందట. నటించే సమయంలో హావభావాలు కరెక్టుగా ఉన్నాయో లేదో దర్సకుడిని అడిగి తెలుసుకుందట. అంతే కాదు స్క్రీన్ పైన చూసుకున్న తరువాత తనకు నచ్చితేనే ఆ షాట్ ఓకే అని చెబుతుందట. లేకుంటే మరోసారి నటించేందుకు ఎప్పుడూ సిద్థంగా ఉంటుందట తమన్నా. అందుకే తాను సినిమాల్లో నటించేటప్పుడు ఎప్పుడూ నిత్య విద్యార్థినే అంటోంది మిల్కీ బ్యూటీ.