శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 13 డిశెంబరు 2017 (19:09 IST)

పవన్ కళ్యాణ్ ఓ గజినీ... బతికి వుండగానే చంద్రబాబు పథకాలా? రోజా తీవ్ర విమర్శ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ గజినీ అంటూ అభివర్ణించారు. ఆయన అలా తయారయ్యారంటూ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై పవన్‌కు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు గుర్తుకు రావడం లేదా అంటూ మండిపడ్డారు. జగన్ మ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ గజినీ అంటూ అభివర్ణించారు. ఆయన అలా తయారయ్యారంటూ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై పవన్‌కు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు గుర్తుకు రావడం లేదా అంటూ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి మాత్రమే వారసత్వం అంటూ పవన్ మాట్లాడటం చూస్తుంటే ఆయన ఓ గజినీలా మారిపోయారా అనే అనుమానం వస్తోందని అన్నారు.
 
ప్రజారాజ్యం పార్టీని ఆనాడు చిరంజీవి ఎందుకు స్థాపించారు, అధికారం కోసం కాదా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ అంతిమ లక్ష్యం అధికారం కాదా అని అడిగారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్‌కు తెలియకుండానే పార్టీని స్థాపించి పనిచేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
 
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలో 21 పథకాలకు చంద్రబాబు పేరు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తోందనీ, ఎవరైనా బతికి ఉండగానే తమ పేర్లను పథకాలకు పెట్టుకుంటారా? అంటూ ప్రశ్నించారు. చంద్రన్న మాల్స్ ఎందుకో ఎవరికీ తెలియదన్నారు.