శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 12 డిశెంబరు 2017 (18:05 IST)

చంద్రబాబుకు పవన్ ఎంతకు అమ్ముడుపోయారో తెలుసా? జగన్ ప్రశ్న

గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబునాయుడు. అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు నాయుడుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మ

గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబునాయుడు. అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు నాయుడుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో చూడాలని జగన్ బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న జగన్ చంద్రబాబు నాయుడుపై విమర్శల మీద విమర్శలు  చేస్తున్నారు. నిన్న బాబును గెలిపిస్తే ఇంటింటికి కేజీ బంగారమని చెప్పిన జగన్ ఈసారి ఎన్నికల్లో బాబుకు అమ్ముడుపోయి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసే నటుడు ఎవరోనని ప్రజలనే ప్రశ్నించారు జగన్. 
 
గత ఎన్నికల్లో ఒక నటుడు బాగా లాభం పొందాడు.. బాగా లాక్కున్నట్లు ఉన్నాడు. అందుకే బాబు చెప్పిన అబద్ధాలన్నీ అలాగే చెప్పాడంటూ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు జగన్. గత కొన్నిరోజులుగా వైసిపిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఉండటంతో జగన్ కూడా పవన్ పైన పదునైన విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై జనసేన కౌంటర్ ఎటాక్ ఎలా చేస్తుందో?