శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (16:24 IST)

అజ్ఞాతవాసి ఆడియోకు అన్నయ్య వస్తారా?

అజ్ఞాతవాసి సినిమా పాటలు ఆడియోకు ముందే వైరల్ అవుతున్నాయి. అజ్ఞాతవాసి చిత్రంలో పవన్‌కి సరసన జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేశ్‌లు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప

అజ్ఞాతవాసి సినిమా పాటలు ఆడియోకు ముందే వైరల్ అవుతున్నాయి. అజ్ఞాతవాసి చిత్రంలో పవన్‌కి సరసన జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేశ్‌లు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే రెండు పాటలు సోషల్ మీడియాలో విడుదలైన నేపథ్యంలో.. జనవరి పదో తేదీన సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇటీవల ఫస్ట్‌లుక్, టైటిల్‌ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా అనిరుధ్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న గాలివాలుగా లిరికల్ సాంగును విడుదల చేసింది. 
 
ప్రస్తుతం ఈ సినిమా ఆడియోపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ఆడియో విడుదల కంటే ముందే టీజర్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు ''అజ్ఞాతవాసి'' వచ్చేస్తున్నాడు. డిసెంబర్ 16న ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదల కానుంది.

ఇక పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ''అజ్ఞాతవాసి'' ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్లు ఫిలింనగర్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 
 
గతంలో పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి మెగాస్టార్ హాజరయ్యాడు. ప్రస్తుతం ''సైరా'' సినిమాలో బిజీగా వుండటంతో చిరు ఆడియోకు రిలీజ్‌కు రాలేరని కూడా పుకార్లు వినివిస్తున్నాయి. మరి అజ్ఞాతవాసి ఆడియోకు చిరు వస్తారో? లేదో? వేచి చూడాల్సిందే.