శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (12:14 IST)

రండి బాబు రండి.. 10 లీటర్ల మూత్రానికి రూ.1 : నితిన్ గడ్కరీ

రండి బాబూ.. రండి.. పది లీటర్ల మూత్రం తీసుకొస్తే ఒక్క రూపాయి చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇదేంటి.. మూత్రానికి డబ్బులు ఎందుకు చెల్లిస్తారనే కాదా

రండి బాబూ.. రండి.. పది లీటర్ల మూత్రం తీసుకొస్తే ఒక్క రూపాయి చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇదేంటి.. మూత్రానికి డబ్బులు ఎందుకు చెల్లిస్తారనే కాదా మీ సందేహం. అయితే, మంత్రిగారి వివరణ తెలుసుకోండి. 
 
దేశవ్యాప్తంగా మనిషి మూత్రం బ్యాంకులను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉంది. మూత్రం బ్యాంకులను ఏర్పాటు చేయడం ద్వారా ఎరువుల దిగుమతి తగ్గించుకోవచ్చన్నది కేంద్రం ఆలోచన. మూత్రంలో ఉండే నైట్రోజన్‌ ద్వారా పెద్ద మొత్తంలో యూరియాను తయారు చేయొచ్చట. దీన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు స్వీడిష్‌ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 
 
ఇప్పటికే మానవ మూత్రంలోని నైట్రోజన్‌ భారీగా వృథా అవుతోందని.. దీన్ని అరికట్టి సంపద సృష్టించాలన్నదే తమ లక్ష్యమన్నారు. అందువల్ల  ప్రభుత్వం అందించే ప్లాస్టిక్‌ డబ్బాలలో పది లీటర్ల మూత్రాన్ని రైతులు తాలుకా కేంద్రాలకు తీసుకొస్తే లీటరు మూ త్రానికి రూ.1 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మూత్రాన్ని వడకడితే ద్రావణీయ ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. 
 
ఈ ప్రక్రియను ఇప్పటికే తన సొంత గ్రామం ధాపేవాడలో అమలు చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. ఫాస్పరస్‌, పొటాషియమ్‌ అందుబాటులో ఉన్నాయని, నైట్రోజన్‌ను కూడా ఉత్పత్తి చేయగలిగితే ఎంతో మేలు జరుగుతుందని ఆయన సెలవిస్తున్నారు. సో.. ఇంకెందుకు ఆలస్యం. మూత్ర సేకరణ చేపట్టండి.