ఐడియా కొత్త ఆఫర్.. రూ.357 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు 1జీబీ ఉచిత డేటా

టెలికాం రంగ సంస్థలు జియో దెబ్బతో వినియోగదారులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్ర‌స్తుతం జియోలో రూ.399తో రీఛార్జ్ చేసుకుంటూ 70 రోజుల వాలిడిటీతో రోజుకు 1జీబీ ఉచిత డేటా, అప‌రిమిత లోక‌ల్‌, ఎస్టీడీ క

selvi| Last Updated: సోమవారం, 6 నవంబరు 2017 (17:14 IST)
టెలికాం రంగ సంస్థలు జియో దెబ్బతో వినియోగదారులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్ర‌స్తుతం జియోలో రూ.399తో రీఛార్జ్ చేసుకుంటూ 70 రోజుల వాలిడిటీతో రోజుకు 1జీబీ ఉచిత డేటా, అప‌రిమిత లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ అందుకునే సౌలభ్యం వుంది.

ఈ నేపథ్యంలో ఐడియా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. తాజాగా ఐడియా త‌మ వినియోగ‌దారులకు ప్రకటించిన ఆఫర్ ద్వారా 28రోజుల కాల వ్యవధిలో రూ.357లకు రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా పొందవచ్చు. అంతేగాకుండా.. ఈ ఆఫర్ ద్వారా రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు అందుకోవ‌చ్చునని ఐడియా ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు వొడాఫోన్ కూడా రూ.496
ప్యాక్ ద్వారా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌, ఫ్రీ నేషనల్ రోమింగ్, 1 జీబీ డేటాను 84 రోజుల పాటు అందిస్తుంది. అలాగే రూ.177 ప్యాక్ కింద అన్ లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 28 రోజుల పాటు 1 జీబీ డేటాను అందిస్తోంది.దీనిపై మరింత చదవండి :