గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 నవంబరు 2017 (15:32 IST)

వచ్చే నెలతో రిలయన్స్ సేవలు బంద్...

అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్ కామ్ సేవలు నిలిచిపోనున్నాయి. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 2జీ, 3జీతో పాటు వాయిస్ కాల్స్ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్ కామ్ సేవలు నిలిచిపోనున్నాయి. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 2జీ, 3జీతో పాటు వాయిస్ కాల్స్ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. 
 
వరుస నష్టాలతో సతమతమవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో తమ కస్టమర్లను మరో నెట్‌వర్క్ తలిస్తున్నట్టు కూడా ఆ కంపెనీ వెల్లడించింది. టెలికామ్ రెగ్యూలెటర్ అథారిటీ ఆదేశాల మేరకు రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
రిలయన్స్ కమ్యూనికేషన్ ఇప్పుడు కేవలం 4జీ సేవలను మాత్రమే తమ కస్టమర్లకు అందించనుంది. ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర, యూపీ ఈస్ట్‌, వెస్ట్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి ఎనిమిది టెలికాం సర్కిళ్లలో 2జీ, 4జీ సర్వీసులను అందించనున్నట్టు ఆర్‌కామ్‌, ట్రాయ్‌కు తెలిపింది.