మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (14:49 IST)

కార్తీక మాసంలో గేదె నేతితో దీపం వెలిగించకూడదట..

కార్తీక మాసంలో దీపదానం చేసేందుకు ఆవునెయ్యి ఉత్తమం. గేదె నేతితో దీపము వెలిగించకూడదు. గేదే నేతితో వెలిగిస్తే పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పంగా ఆవునేయి కలిపి వెలిగిస్తే దోషములేదు. అలాంటి ద

కార్తీక మాసంలో దీపదానం చేసేందుకు ఆవునెయ్యి ఉత్తమం. గేదె నేతితో దీపము వెలిగించకూడదు. గేదే నేతితో వెలిగిస్తే పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పంగా ఆవునేయి కలిపి వెలిగిస్తే దోషములేదు. అలాంటి దీపారాధన పూజామందిరంలో, దేవాలయాలలో గృహప్రాంగణాలలో, తులసీ బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీతీరాలలో వెలిగించుటం అత్యంత పుణ్యప్రదం.
 
ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలిగిస్తే.. పుణ్యఫలాలు చేకూరుతాయి. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నులపండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా చేస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు.
 
కార్తీక సోమవారం రోజు స్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శనం అయ్యేవరకు ఉపవాసం చేసి తరువాత భుజించినవారి పాపాలు అగ్నిలో పడిన దూదివలే నాశనం అవుతుంది. ఆ రోజునశివుడికి అభిషేకం చేసి, బిల్వదళంబులతో సహస్రనామార్చన చేసి, ఇతరులచే చేయించిమా, శివపంచాక్షరీ మంత్రాన్ని జపించినా, వారిని శివుడు ఆనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభాలను చేకూరుస్తాడు.
 
కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వుంచి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతో గానీ, కొబ్బరినూనెతో గానీ, నెయ్యితోగాని, అవిశనూనెతో గానీ, ఇప్పనూనెతో గానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. కార్తీకమాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని పురాణాలు చెప్తున్నాయి.