మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (21:53 IST)

జపాన్ మీదుగా క్షిపణి... కిమ్ (పిచ్చోడి) చేతిలో రాయిలా 'అణు బాంబు'

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ జపాన్ ప్రజలకు చుక్కలు చూపించారు. జపాన్‌లోని ఎరిమో, హోక్కైడో నగరాల్లో ఓ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ జపాన్ ప్రజలను పరుగులు తీసేలా చేశాయి. అణు క్షిపణి వచ్చి పడనుందని.. అందరూ

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ జపాన్ ప్రజలకు చుక్కలు చూపించారు. జపాన్‌లోని ఎరిమో, హోక్కైడో నగరాల్లో ఓ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ జపాన్ ప్రజలను పరుగులు తీసేలా చేశాయి. అణు క్షిపణి వచ్చి పడనుందని.. అందరూ ఇళ్లల్లోకి పారిపోండనే మాటలు విన్న జపాన్ ప్రజలు వణుకుతో పరుగులు తీశారు. 
 
ఉత్తర కొరియా శుక్రవారం మరో క్షిపణి పరీక్షను నిర్వహించి, దాన్ని జపాన్ మీదుగా వదిలింది. ఈ సందర్భంగా జపాన్ ప్రజలను అలా అలెర్ట్ చేశారు. క్షిపణి జపాన్ మీదుగా వెళుతూ ఉండటాన్ని ఆ దేశ రాడార్లు ముందే పసిగట్టగా, హై అలర్ట్‌ను ప్రకటించారు. ఆ క్షిపణి జపాన్‌పై పడే ప్రమాదం ఉండటంతో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు విషయాన్ని చేరవేశారు. దీంతో జనాలు పరుగులు తీశారు. 
 
అయితే ఉత్తర కొరియా తీరుపై జపాన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. పదేపదే తమ దేశం మీదుగా ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తుండటం.. అవి పసిఫిక్ మహా సముద్రంలో పడుతుండటాన్ని గమనించిన జపాన్.. ఇకపై కిమ్ జాంగ్‌ దూకుడుకు బ్రేక్ వేయాలనుకుంటోంది. ఆయన చేష్టలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది.
 
అయితే ఉత్తర కొరియా ప్రయోగించే క్షిపణులు జపాన్‌పై పడితే ఇక నగరాలు మాయమైపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జపాన్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరోవైపు రష్యా కూడా కిమ్ జాంగ్ చేష్టలపై మండిపడుతోంది. మొత్తమ్మీద అణు బాంబులు కిమ్ చేతిలో పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి. వాటిని ఎటు విసిరాస్తాడోనన్న భయంతో ప్రపంచం బిక్కుబిక్కుమంటోంది.