శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 నవంబరు 2017 (14:16 IST)

మొన్న వాట్సాప్.. నేడు ఫేస్‌బుక్... మెసెంజర్ బ్రేక్‌డౌన్

సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌‌లలో మెసెంజర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మొన్నటికిమొన్న ట్విట్టర్ మెసెంజర్‌కు అంతరాయం కలిగితే, ఇపుడు ఫేస్‌బుక్ మెసెంజర్ బ్రేక్ అయింది. బ్రేక్ డౌన్

సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌‌లలో మెసెంజర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మొన్నటికిమొన్న ట్విట్టర్ మెసెంజర్‌కు అంతరాయం కలిగితే, ఇపుడు ఫేస్‌బుక్ మెసెంజర్ బ్రేక్ అయింది. బ్రేక్ డౌన్ అయిన సమయంలో పాత మెసేజ్‌లు కూడా కనిపించకుండా పోయాయి. 
 
శనివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల మధ్య బ్రేక్ డౌన్ అయ్యింది. గంటన్నర పాటు ఫేస్‌బుక్ మెసెంజర్ డౌన్ కావటంతో.. మెసేజ్‌లు వెళ్లలేదు. ఈ విషయాన్ని గుర్తించి.. సరిచేసే సరికి గంటన్నర సమయం పట్టింది. ప్రస్తుతం యధావిధిగానే పని చేస్తోంది.
 
కాగా, ఈ అంతరాయం ఒక్క భారత్‌లోనే కాకుండా, బ్రిటన్, జర్మనీ, పాకిస్థాన్‌తోపాటు మరికొన్ని దేశాల్లో ఏర్పడింది. వాట్సాప్‌ డౌన్ కావటం ఈ సంవత్సరం మూడోసారి అయితే.. మెసెంజర్ సర్వీసులు బ్రేక్ పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.