మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (19:20 IST)

హోటల్‌లో ఒంటరిగా ఆహారం తీసుకుంటున్న బాలయ్య (వీడియో)

కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాలయ్య హీరోగా నటిస్తున్నాడు. బాలయ్య సరసన నయనతార నటిస్తోంది. నటాషా అనే మలయాళ ముద్దుగుమ్మ బాలయ్య కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. బాలయ్య 102 సినిమాగా

కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాలయ్య హీరోగా నటిస్తున్నాడు. బాలయ్య సరసన నయనతార నటిస్తోంది. నటాషా అనే మలయాళ ముద్దుగుమ్మ బాలయ్య కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. బాలయ్య 102 సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ ని ''జై సింహా''గా ఫిక్స్ చేసినట్లు తెలసింది. బాలయ్య కెరీర్‌లో ''సింహ" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 
 
ప్రస్తుతం అదే ''సింహా''కు ముందు "జై"కి యాడ్ చెయ్యడంతో ఈ సినిమా కూడా అంతే పవర్ ఫుల్ హిట్ అందుకుంటుందని సినీ యూనిట్ భావిస్తోంది. ఈ మూవీకి ''కర్ణ'' అనే టైటిల్‌ని కూడా అనుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. త్వరలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ  నేపథ్యంలో బాలయ్య ఓ హోటల్‌లో ఒంటరిగా కూర్చుని ఆహారం తీసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఓ హోటల్‌లో బాలయ్య ఆహారం తీసుకుంటుండగా.. ఆయన పక్కన ఎవ్వరూ లేరు. సెక్యూరిటీ కూడా పెద్దగా లేదు. సాధారణ మనిషిలా ఎలాంటి ఆర్బాటం లేకుండా ఆహారం తీసుకుంటూ బాలయ్య కనిపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియోను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోపై బాలయ్య అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన స్టార్‌డమ్‌ని సైతం బాలకృష్ణ లెక్కచేయరని, చాలా సింపుల్‌గా ఉంటారని కితాబిస్తున్నారు.