1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Plane crashes on St Pete road in Florida hitting two vehicles

ఆకాశంలో ఇంధనం అయిపోవడంతో రోడ్డుపై కూలిన విమానం... (Video)

అమెరికా, ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఇంధనం ఖాళీకావడంతో ఆ విమానం నడి రోడ్డుపై కుప్పకూలిపోయింది. దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో

Plane crashes
అమెరికా, ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఇంధనం ఖాళీకావడంతో ఆ విమానం నడి రోడ్డుపై కుప్పకూలిపోయింది. దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ఓ విమానం ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఇంధనం అయిపోయింది. దీన్ని గమనించిన పైలట్ ఏటీసీని సంప్రదించారు. అనంతరం అకస్మాత్తుగా విమానం కుప్పకూలింది. కుప్పకూలుతున్న విమానాన్ని అదుపు చేసేందుకు పైలట్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో అది ఫ్లోరిడా సెంయిట్ పీట్ రోడ్డుపై కూలిపోయింది. 
 
ఈ క్రమంలో విమానం వేగంగా కిందికి దిగడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న కార్లను తోసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని ఢీ కొట్టగానే విమానానికి మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానం నుంచి కిందికి దూకేశారు. ఈ ప్రమాదంలో రెండు ఎస్యూవీ వాహనాలు ధ్వంసం కాగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వోడాఫోన్ బంపర్ ఆఫర్... రూ.399 రీచార్జ్‌తో ఆర్నెల్లు ఉచితం