శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (14:23 IST)

ఇర్మా హరికేన్.. భారతీయులు క్షేమం : సుష్మా స్వరాజ్

హరికేన్ ఇర్మా బాధితుల్లో చిక్కుకున్న భారతీయులందరూ క్షేమంగానే ఉన్నారనీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ముఖ్యంగా, ఇర్మా బాధిత ప్రాంతాలైన కారకాస్‌ (వెనిజులా రాజధాని), హవానా (క్యూబా రాజధాని), జార

హరికేన్ ఇర్మా బాధితుల్లో చిక్కుకున్న భారతీయులందరూ క్షేమంగానే ఉన్నారనీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ముఖ్యంగా, ఇర్మా బాధిత ప్రాంతాలైన కారకాస్‌ (వెనిజులా రాజధాని), హవానా (క్యూబా రాజధాని), జార్జ్‌టౌన్‌, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నట్లు ఆమె ట్వీట్ చేశారు.
 
హరికేన్‌ ఇర్మా సృష్టించిన జల ప్రళయానికి అనేక ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెల్సిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే భారతీయుల క్షేమ సమాచారాన్ని దౌత్య అధికారులను ఆమె సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. అయితే, ఫ్లోరిడాలో నివసించే భారతీయులను అట్లాంట తరలించేందుకు అన్ని సిద్ధం చేశామన్నారు.
 
ఇర్మా ప్రభావిత ప్రాంతాల్లో 24గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి కోసం సింట్‌ మార్టెన్‌ నుంచి ఆహారపదార్థాలను పంపిస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీలోని భారత దౌత్య కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. సహాయం కోసం 202 258 8819 నంబరుకు ఫోన్‌ చేయాల్సిందిగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.