శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (20:02 IST)

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌.. ఇక లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనవచ్చు..

సోషల్ మీడియాలో ఒక్కటైన ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. నెట్టింట ఇన్‌స్టాగ్రామ్‌కు పెరిగిపోతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న ఫేస్‌బుక్ వారి ఫొటో షేరింగ్ యాప్ సంస్థ అక్టోబర్ 25 (బుధవార

సోషల్ మీడియాలో ఒక్కటైన ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. నెట్టింట ఇన్‌స్టాగ్రామ్‌కు పెరిగిపోతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న ఫేస్‌బుక్ వారి ఫొటో షేరింగ్ యాప్ సంస్థ అక్టోబర్ 25 (బుధవారం) నుంచి ఒకే లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనే అవకాశాన్ని కల్పించింది.

గత ఏడాది నవంబరులో లైవ్ వీడియో ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌‌ ప్రవేశపెట్టింది. దీంతో ఫోటోల కంటే లైవ్‌ల ద్వారానే ప్రతి చిన్న విషయాన్ని నెటిజన్లు షేర్ చేసుకునేందుకు మొగ్గు చూపారు. దీంతో నెటిజన్లకు లైవ్‌లో ఒకరు మాత్రమే పాల్గొనేలా కాకుండా.. ఒకే లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనే అవ‌కాశాన్ని క‌ల్పించింది. 
 
ఇవాల్టి నుంచి ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానున్న‌ట్లు త‌మ బ్లాగ్‌లో పేర్కొంది. యాప్ అప్‌డేట్ చేసుకున్న తర్వాత లైవ్ చేసేటప్పుడు పక్కనే యాడ్ బటన్ వుంటుంది. దాని ద్వారా అప్పుడు లైవ్ చూస్తున్న వారిలో నచ్చిన వారిని లైవ్ చేయవచ్చు. వెంట‌నే మీ లైవ్ స్క్రీన్ భాగాలుగా విడిపోతుంది.

ఆ భాగాల్లో గ్రూప్ లైవ్ చేస్తున్న వారంతా క‌నిపిస్తారు. స్నేహితులంద‌రూ క‌లిసి లైవ్ చేయాల‌నుకునే వారికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.