జియోకు చెక్ : ఎయిర్‌టెల్ ఆఫర్.. 60 జీబీ ఉచిత డేటా

రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ నడుంబిగించింది. ఇందుకోసం మొబైల్ వినియోగదారులను ఆకర్షించేలా వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందులోభాగంగా, ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పె

airtel 4g phone
pnr| Last Updated: ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (16:39 IST)
రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ నడుంబిగించింది. ఇందుకోసం మొబైల్ వినియోగదారులను ఆకర్షించేలా వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందులోభాగంగా, ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు 60 జీబీ ఉచిత డేటాను అందివ్వనుంది.

6 నెల‌ల కాలానికి గాను నెల‌కు 10 జీబీ డేటా చొప్పున ఈ ఉచిత డేటా అందిచనుంది. అయితే ఇందుకుగాను వినియోగ‌దారులు ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్ల‌లో మై ఎయిర్‌టెల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఫోన్ నంబ‌ర్‌ను ఓటీపీతో నిర్ధారించాల్సి ఉంటుంది.

అనంత‌రం హోమ్ పేజీలో పైభాగంలో ఉండే Enjoy Live Shows With అనే బ్యాన‌ర్‌ను క్లిక్ చేయాలి. అనంతరం ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో ఉచిత డేటా ఆఫ‌ర్ అన్‌లాక్ అవుతుంది. ఆఫ‌ర్ అన్‌లాక్ కాగానే వినియోగ‌దారుడి ఖాతాలోకి 10 జీబీ డేటా వ‌స్తుంది. అనంత‌రం మ‌రో 5 నెల‌ల పాటు నెల‌కు 10 జీబీ డేటా చొప్పున మొత్తం క‌లిపి 60 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది.

గ‌తంలో ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌, మాన్‌సూన్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే వాటి ద్వారా 3 నెల‌లకు 30 జీబీ డేటా (నెల‌కు 10 జీబీ చొప్పున‌) అందించింది. కాగా ఇప్పుడు కాల ప‌రిమితిని 3 నుంచి 6 నెల‌ల‌కు పెంచి డేటాను అందిస్తున్న‌ది. అయితే ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే వినియోగ‌దారుల‌కు ఖచ్చితంగా 4జీ హ్యాండ్ సెట్‌ను కలిగివుండాలి.దీనిపై మరింత చదవండి :