జియో - ఎయిర్‌టెల్ బాటలో ఐడియా.. రోజుకు 1.5 జీబీ ఫ్రీ డేటా

రిలయన్స్ జియో పుణ్యమాని దేశీయ టెలికాం రంగంలో ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. తమ వినియోగదారులు రిలయన్స్ జియ వైపు మళ్ళిపోకుండా ఉండేందుకు వీలుగా ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ఆఫర్ల వర్షం కురిపి

idea 4g phone
pnr| Last Updated: గురువారం, 14 సెప్టెంబరు 2017 (07:07 IST)
రిలయన్స్ జియో పుణ్యమాని దేశీయ టెలికాం రంగంలో ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. తమ వినియోగదారులు రిలయన్స్ జియ వైపు మళ్ళిపోకుండా ఉండేందుకు వీలుగా ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.

ఈ కోవలో తాజాగా ఐడియా కంపెనీ కూడా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఓ బెస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా, రోజుకు 1.5 డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ అందివ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం త‌మ వినియోగ‌దారులు రూ.697తో రీఛార్జ్‌ చేసుకోవాల‌ని తెలిపింది.

ఈ ఆఫర్ కింద క‌స్ట‌మ‌ర్లు మొత్తం 126 జీబీ డేటాను అంటే రోజుకి 1.5 జీబీ చొప్పున‌ 84 రోజుల పాటు పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది. దీంతో పాటు ఉచిత అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్టీడీ వాయిస్‌కాల్స్‌ను కూడా పొందవ‌చ్చ‌ని తన వెబ్‌సైట్‌లో తెలిపింది.దీనిపై మరింత చదవండి :