గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 31 జులై 2017 (12:00 IST)

జియోకు పోటీగా ఐడియా 4జీ ఫీచర్ ఫోన్.. ఫ్రీగా మాత్రం కాదు...

రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్ ఫోనును అందజేయనున్నట్టు ప్రటించింది. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించుకోనున్నట్టు తెలిపింది. దీంతో ఇతర మొబైల్ ఆపరేటర్లు కూడా ఇదే తరహా ఆఫర్‌కు తమ వినియ

రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్ ఫోనును అందజేయనున్నట్టు ప్రటించింది. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించుకోనున్నట్టు తెలిపింది. దీంతో ఇతర మొబైల్ ఆపరేటర్లు కూడా ఇదే తరహా ఆఫర్‌కు తమ వినియోగదారులనే కాకుండా, కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ముందుకు వస్తున్నారు. 
 
ఈ కోవలో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఇప్పటికే ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1000కే 4జీ ఫీచర్‌ పోనును ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇపుడు మరో మొబైల్ కంపెనీ ఐడియా కూడా రూ.2500కే 4జీ ఫీచర్ ఫోనును అందజేయనున్నట్టు ప్రకటించింది. 
 
ఐడియా సెల్యులార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఐడియా నుంచి త్వరలో ఓ నూతన 4జీ ఫోన్ వస్తుందని తెలిపారు. అయితే ఈ ఫోన్ ధర జియో కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుందని అన్నారు. రూ.2500కు 4జీ ఫోన్‌ను అందిస్తామని చెప్పారు. 
 
జియో ఫోన్‌లో వాట్సాప్ లాంటి యాప్స్ రావని, అందులో కేవలం జియో సిమ్ మాత్రమే పనిచేస్తుందని విమర్శించారు. కానీ తాము తీసుకురాబోయే ఫోన్‌లో యూజర్లకు అవసరమైన వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి అన్ని యాప్స్ పనిచేస్తాయన్నారు. అయితే అందులో మరి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తారా..? లేదా..? అన్న వివరాలను వెల్లడించలేదు.