శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr

ఐసీఐసీఐ ఆఫర్ : గృహరుణం తీసుకుంటే రూ.10 వేల క్యాష్‌బ్యాక్

ప్రస్తుతం అన్ని బ్యాంకుల్ల నగదు నిల్వలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రుణాలు తీసుకునే వారిని ఆకర్షించేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్‌ దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలు త

ప్రస్తుతం అన్ని బ్యాంకుల్ల నగదు నిల్వలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రుణాలు తీసుకునే వారిని ఆకర్షించేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్‌ దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి. అలాగే, పెద్దగా హామీలు అక్కర్లేకుండానే కొన్ని గంటల్లోనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. 
 
తాజాగా దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ పండగ సీజన్‌లో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గృహరుణం తీసుకునేవారికి క్యాష్‌బ్యాక్‌ పథకాన్ని ప్రకటించింది. కొత్త పథకం కింద ఐసీఐసీఐ బ్యాంకు గృహరుణం పొందేవారితో పాటు, వేరే బ్యాంకులో ఉన్న రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు బదిలీ చేసుకుంటే 20 శాతం వరకూ లేదా రూ.10 వేల క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. 
 
అయితే, ఈ ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డును వినియోగించి రూ.30,000 కొనుగోళ్లు జరిపిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 1 నుంచి నవంబర్‌ 30, 2017 వరకూ అందుబాటులో ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
గృహరుణం పొందిన మూడు నెలల్లోగా క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు. ఒక కార్డుకు ఒకసారి మాత్రమే క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. పథకం అందుబాటులో ఉన్న సమయంలో గృహరుణం పొందటంతో పాటు, సదరు వినియోగదారుడు క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా రూ.30వేల లావాదేవీ జరపాల్సి ఉంటుంది.