సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (09:01 IST)

ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్‌ : అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్‌లు

రిలయన్స్ దిగ్గజం జియోకి పోటీగా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. 360 రోజుల కాలపరిమితితో డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో 300 జీబీ 4జీ డేటా, అన్ లిమిట

రిలయన్స్ దిగ్గజం జియోకి పోటీగా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. 360 రోజుల కాలపరిమితితో డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో 300 జీబీ 4జీ డేటా, అన్ లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభించేలా రూపొందించింది. అయితే ఈ ప్లాన్ యాక్టివేట్ అయ్యేందుకు రూ.3,999తో రిచార్జి చేయించుకోవాలి. 
 
అంటే ప్రతి నెలా రూ.334 చెల్లించాలన్నమాట. డేటా ప్రకారం విభజిస్తే నెలకు 25 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్ వినియోగించుకోవచ్చు. అయితే ఎయిర్‌ టెల్ నెలవారీ ప్యాకేజీ కాలపరిమితి 28 రోజులు మాత్రమే కాబట్టి దీనితో పాటు రూ.349 ప్లాన్‌లో కూడా మార్పులు చేసింది. అంటే 28 రోజుల వ్యాలిడిటీ ప్రకారం రోజుకు 1.5జీబి 4జీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవచ్చు.