శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (13:55 IST)

వైసిపి నేతలకు జగన్ బంపర్ ఆఫర్... ఏంటది?

2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు అధినేత. అంతేకాదు అ

2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు అధినేత. అంతేకాదు అధికారం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో నవరత్నాల హామీలను ప్రకటించిన జగన్ వాటిని విస్తృతంగా తీసుకెళుతున్నారు. అంతేకాదు వై.ఎస్.ఆర్ కుటుంబం పేరుతో ప్రారంభించిన కార్యక్రమానికి మంచి స్పందనే వచ్చింది. కోటి మందిని వై.సి.పిలోకి తీసుకురావాలనుకుని అందులో సక్సెస్ అయ్యారు జగన్. 
 
పార్టీలో పెద్దఎత్తున మార్పులు, చేర్పులు చేసే పనిలో పడ్డారు జగన్. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే వారికి మాత్రమే బాధ్యతలు అప్పజెప్పాలన్నది జగన్ ఆలోచన. అందుకే ప్రస్తుతం క్రిష్ణా, అనంతపురం జిల్లాలకు చెందిన వారికి పార్టీ పదవులను అప్పచెబుతున్నారు జగన్. ఎన్ఆర్ఐ విభాగం కేంద్ర విభాగం సమన్వయకర్త, వైసిపి రాష్ట్ర పదవి, ఇలా కొన్ని పదవులను ప్రకటించిన జగన్ వీరందరూ పార్టీని ముందుకు తీసుకెళ్ళి అధికారం తీసుకొచ్చేందుకుశాయశక్తులా కృషి చేస్తారన్నది జగన్ నమ్మకం. మరి జగన్ నమ్మకాన్ని వీరు ఎంతమేరకు ముందుకు తీసుకెళతారో వేచి చూడాల్సిందే.