సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (17:09 IST)

ఎయిర్ టెల్ నుంచి రూ.1,349కే సెల్‌కాన్‌ స్మార్ట్‌ 4జీ: రీఫండ్ పొందాలంటే ఏం చేయాలి..?

ఉచిత డేటా పేరిట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ ఏకమైనాయి. ఇందులో భాగంగా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడంలో టెలికాం సంస్థలన్నీ సిద్ధమవుతున్నాయి. తాజాగ

ఉచిత డేటా పేరిట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ ఏకమైనాయి. ఇందులో భాగంగా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడంలో టెలికాం సంస్థలన్నీ సిద్ధమవుతున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ రూ.1,349కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 
 
ఇప్పటికే ఈ సంస్థ కార్బన్‌ మొబైల్స్‌తో కలిసి రూ.1,399కే స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించిన ఎయిర్‌టెల్.. ప్రస్తుతం సెల్‌కాన్‌తో కలిసి మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తుంది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌'లో భాగంగా ఎయిర్‌టెల్‌ "సెల్‌కాన్‌ స్మార్ట్‌ 4జీ" ఫోన్‌ను తయారుచేస్తోంది. 4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌, రెండు సిమ్‌ల సదుపాయంతో పాటు అన్ని ఆండ్రాయిడ్‌ యాప్స్‌ సపోర్ట్‌ చేసేలా మార్కెట్లోకి తీసుకురానుంది. 
 
ఇందుకోసం రూ.2,849 డౌన్‌ పేమెంట్‌ చెల్లించాల్సి వుంటుందని.. ఈ మొత్తంలో రూ.1500లను సంస్థ రీఫండ్ చేస్తుందని ఎయిర్‌టెల్ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు నెలకు రూ.169 చొప్పున మొత్తం 36 నెలలకు ఒకేసారి రీఛార్జ్‌ చేసుకోవాలి. 36 నెలల రీఛార్జ్‌ వద్దనుకునేవారు సాధారణ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు కూడా పొందవచ్చు.
 
తొలి 18 నెలల పూర్తయ్యాక రూ.500, మూడేళ్ల తర్వాత వెయ్యిరూపాయలను కస్టమర్లకు సంస్థ రీఫండ్ చేస్తుంది. కానీ రీఫండ్ విషయంలో ఎయిర్‌టెల్ ట్విస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా రీఫండ్‌ పొందాలంటే మాత్రం మొదటి 18నెలలకు రూ.3000 విలువైన రీఛార్జ్‌లు తప్పకుండా చేసుకోవాలి. అంతేగాక మిగతా 18 నెలలకు కూడా రూ.3000 విలువైన రీఛార్జ్‌లు చేసుకుంటేనే మిగతా రూ.1000ను కంపెనీ రీఫండ్‌ చేస్తుందని ఎయిర్ టెల్ వెల్లడించింది.