మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (14:39 IST)

కాశ్మీర్‌లో జియో ఫోన్‌ పేలిపోయింది: అదో వివాదమేన్న రిలయన్స్

అప్పట్లో శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లు పేలిన ఘటనలు గుర్తుండే వుంటాయి. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన జియో సంస్థ తాజాగా విడుదల చేసిన ఫోన్ పేలింది. జియో ఫోన్‌ల బుకింగ్స్ ప్రారంభం

అప్పట్లో శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లు పేలిన ఘటనలు గుర్తుండే వుంటాయి. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన జియో సంస్థ తాజాగా విడుదల చేసిన ఫోన్ పేలింది. జియో ఫోన్‌ల బుకింగ్స్ ప్రారంభం కావడమే ఆలస్యం.. వాటికి ఊహించని విధంగా స్పందన వచ్చింది. ఇప్పటికే చాలామంది ఈ ఫోన్లను అందుకున్నారు. అయితే కాశ్మీర్‌‌లో ఛార్జింగ్ పెట్టిన‌ ఒక జియో ఫోన్ పేలిపోయింద‌ని తెలిసింది. దీంతో ఈ హ్యాండ్‌సెట్‌ వెనుగ భాగం పూర్తిగా కాలిపోగా, బ్యాటరీకి మాత్రం ఏమీ కాలేదు.
 
దీనిపై స్పందించిన‌ రిలయన్స్‌ రీటైల్ ప్ర‌తినిధులు జియో ఫీచర్ ఫోనును అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించామన్నారు. పేలిన ఫోను విషయం వివాదమేనని.. ప్రతీ ఫోనును నిశితంగా పరిశీలించాకే విడుదల చేశామని అధికారులు తెలిపారు. ఈ పేలుడికి కార‌ణం బ్యాటరీది కాదని లైఫ్ డిస్ట్రిబ్యూటర్ తెలిపింది.  పేలుడు తర్వాత కూడా యూనిట్ బ్యాటరీ ఇప్పటికీ పనిచేస్తుందని రిలయన్స్ రీటైల్ ప్రతినిధులు చెప్పారు.