జియోకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ 4జీ ఓల్ట్ ఫోన్...
రిలయన్స్ జియోకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సరికొత్తగా 4జీ ఓల్ట్ ఫోను మార్కెట్‌లోకి తీసుకరానుంది. ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ మైక్రోమ్యాక్స్ సంస్థ సహకారంతో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది.
రిలయన్స్ జియోకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సరికొత్తగా 4జీ ఓల్ట్ ఫోను మార్కెట్‌లోకి తీసుకరానుంది. ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ మైక్రోమ్యాక్స్ సంస్థ సహకారంతో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది.
దేశీయ టెలికాం రంగంలోకి జియో సేవలు ప్రారంభమైన తర్వాత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఉచిత ఫోన్‌ను అందిస్తోంది. ఈ పోటీని తట్టుకునేందుకు దీపావళికి ఎయిర్‌టెల్ 4జీ ఓల్ట్ ఫోనును ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్ఎన్ఎల్ కూడా చేరింది.
మైక్రోమ్యాక్స్ కంపెనీతో కలిసి 4జీ ఓల్ట్ ఫోన్ రిలీజ్ చేయనుంది. కేవలం రూ.2,200తో ధరలో ఈ ఫోన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 20వ తేదీ అంటే శుక్రవారం నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది బీఎస్ఎన్ఎల్. భారత్ వన్ పేరుతో లాంఛ్ చేస్తోంది. 97 రూపాయలకే అన్‌లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం ఇస్తుంది.
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే...
4జీ ఓల్ట్ ఫోన్. న్యూమరికల్ కీ ప్యాడ్. 2.4 ఇంచ్ స్క్రీన్. క్వాల్కామ్ 205 ప్రాససర్. 512 ఎంబి ర్యామ్. 2 మెగా ఫిక్సల్ కెమెరా. VGA సెల్ఫీ కెమెరా. 2000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగివుంటుంది.
అలాగే, ఈ ఫోన్22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తోంది. మైక్రోమ్యాక్స్ ఎంటర్ టైన్‌మెంట్ యాప్ ఇన్‌బిల్ట్‌గా ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఇందులో లైవ్ టీవీ, మ్యూజిక్, మూవీస్, వీడియో స్ట్రీమింగ్ సదుపాయం ఉంది. డిజిటల్ పేమెంట్స్ కోసం యూపీఏ యాప్ ఉంది. అన్ లాక్ సిమ్. ఏ నెట్ వర్క్ సిమ్ అయిన ఇందులో వాడుకోవచ్చు.