రూ.2 వేలకే మైక్రోమ్యాక్స్ 4జీ ఫీచర్ ఫోన్
దేశంలో పుట్టుకొచ్చిన టెలికాం విప్లవం పుణ్యమాని వివిధ రకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా తక్కువ ధరకు కలిగిన ఫోన్లతో పాటు భారీ ధర కలిగిన ఫోన్లు కూడా ఉన్నాయి. అయితే, రిలయన్స్ పుణ్యమాని టెలికాం రం
దేశంలో పుట్టుకొచ్చిన టెలికాం విప్లవం పుణ్యమాని వివిధ రకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా తక్కువ ధరకు కలిగిన ఫోన్లతో పాటు భారీ ధర కలిగిన ఫోన్లు కూడా ఉన్నాయి. అయితే, రిలయన్స్ పుణ్యమాని టెలికాం రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ధరల పోటీ తీవ్ర స్థాయిలో ఉంది.
అలాగే, మరింతమంది వినియోగదారులను తమ సొంతం చేసుకునేందుకు రిలయన్స్ జియో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌తో ఉచితంగా 4జీ ఫోన్‌ను అందజేయనుంది. దీంతో ఇతర కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
ఈ క్రమంలో జియో 4జీ ఫీచర్ ఫోన్‌కు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ఓ నూతన 4జీ ఫీచర్ ఫోన్‌ను అందజేయనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేయనుంది. 'భారత్ వన్' పేరిట ఈ ఫోన్‌ను మైక్రోమ్యాక్స్ వచ్చే వారంలో విడుదల చేయనుంది.
మైక్రోమ్యాక్స్ విడుదల చేయనున్న భారత్ వన్ 4జీ ఫీచర్ ఫోన్ కేవలం రూ.2వేలకే వినియోగదారులకు లభించనుంది. అయితే లాంచింగ్ సందర్భంగా ఫోన్‌తోపాటు యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బండిల్ డేటా ప్యాక్స్ ఉచితంగా లభించనున్నాయి. కాగా ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన ఇమేజ్‌లు మాత్రమే లీకయ్యాయి. పూర్తి స్పెసిఫికేషన్లు త్వరలో తెలిసే అవకాశం ఉంది.