శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr

త్వరలో నోకియా 8 స్మార్ట్ ఫోన్.. ఫీచర్లివే...

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ 'నోకియా 8' పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను వచ్చేవారం విడుదల చేయనుంది. ఈ నెల 26 లేదా 27వ తేదీన ఓ ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. కాగా దీని ధర రూ.44,990 వరకు ఉండవచ్చని తెలు

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ 'నోకియా 8' పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను వచ్చేవారం విడుదల చేయనుంది. ఈ నెల 26 లేదా 27వ తేదీన ఓ ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. కాగా దీని ధర రూ.44,990 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. 
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే.. 5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3090 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.