ఆ వీడియోలో ఏముందోగానీ.. కోటిన్నర మంది చూశారు... (Jimikki Kammal Video)
ఓనం పండుగ స్పెషల్‌గా కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ కాలేజీ స్టూడెంట్స్ చేసిన 'జిమిక్కి కమ్మల్' డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో
ఓనం పండుగ స్పెషల్‌గా కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ కాలేజీ స్టూడెంట్స్ చేసిన 'జిమిక్కి కమ్మల్' డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఏముందో ఏమోదానీ... కోటిన్నర మంది నెటిజన్లు ఈ వీడియోను తిలకించారు. దీంతో ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆగస్టు 30వ తేదీన రిలీజైన ఈ వీడియో సాంగ్ ను ఇప్పటి వరకు దాదాపు కోటీ ముప్పై లక్షల మంది యూట్యూబ్ లో వీక్షించారు. ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ నటించిన 'వెలిపడింతె పుస్తకం' అనే సినిమాలోని సాంగే ఈ జిమిక్కి కమ్మల్.
ఓనం పండుగ రోజున సంప్రదాయ డ్రెస్సులు వేసుకొన్న కాలేజీ విద్యార్థినులు, కాలేజీ స్టాఫ్ కలిసి ఈ జిమిక్కి కమ్మల్ అనే పాటకు డ్యాన్స్ చేస్తూ మైమరిపించారు. ఇక.. ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చడంతో చాలా మంది ఈ పాటకు తమ వెర్షన్లలో డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ జిమిక్కి కమ్మల్ వీడియో చూస్తూ ఓ రెండు స్టెప్పులేయండి.