ఫేస్‌బుక్‌లో సరికొత్త ఫీచ‌ర్‌.. అమెరికాలో మాత్ర‌మే..!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండటంతో కేవలం అమెరికాని ఫేస్‌బుక్ యూజర్లకు మాత్రమే ఇది ప్రస్తుతానికి అందు

facebook
pnr|
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండటంతో కేవలం అమెరికాని ఫేస్‌బుక్ యూజర్లకు మాత్రమే ఇది ప్రస్తుతానికి అందుబాటులో ఉండనుంది. నిజానికి ఈ ఫీచర్‌ను గత యేడాది కాలం నుంచి ఫేస్‌బుక్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సదుపాయాన్ని అమెరికాలోని యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చింది.

ఫేస్‌బుక్ ప్రవేశపెట్టిన ఫుడ్ డెలివరీ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ ప్లాట్‌ఫాంలపై ఫేస్‌బుక్‌ను వాడుతున్న యూజర్లు పొందవచ్చు. అందుకుగాను వారు ఫేస్‌బుక్‌లోకి వెళ్లి ఎక్స్‌ప్లోర్ మెనూలో ఉన్న ఆర్డర్ ఫుడ్ విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం అందులో తమకు కావల్సిన ఫుడ్‌ను, రెస్టారెంట్‌ను ఎంపిక చేసుకున్నాక డెలివరీ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే చాలు, వెంటనే యూజర్లకు కావల్సిన ఫుడ్ డోర్‌డెలివరీ అవుతుంది.

త్వరలోనే ఈ ఫీచర్‌ను ప్రపంచంలోని ఇతర ఫేస్‌బుక్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ హిమల్ చెప్పారు. ఫేస్‌బుక్‌లో విహరిస్తున్న యూజర్లు అందులోంచి బయటకు వెళ్లకుండానే నేరుగా ఫుడ్‌ను ఆర్డర్‌ను చేసుకునేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఈ క్రమంలో వారు తమ స్నేహితులతో చాట్ చేస్తూ వారికి నచ్చిన ఫుడ్‌ను కూడా ఆర్డర్ చేయవచ్చని అలెక్స్ వివరించారు.దీనిపై మరింత చదవండి :