తామర గింజలు ఆరగిస్తే...
తామరపువ్వు నుంచి వచ్చే గింజలను తామర గింజలు అంటారు. వీటిలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. వీటిని కొందరు పచ్చిగానే ఉపయోగిస్తే.. మరికొందరు వేయించుకుని ఉడకపెట్టుకుని కూరల్లో వాడుతుంటారు.
తామరపువ్వు నుంచి వచ్చే గింజలను తామర గింజలు అంటారు. వీటిలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. వీటిని కొందరు పచ్చిగానే ఉపయోగిస్తే.. మరికొందరు వేయించుకుని ఉడకపెట్టుకుని కూరల్లో వాడుతుంటారు. ఉత్తర భారతదేశంలో పండుగల సమయాల్లో వీటితో స్వీట్స్ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇవి తినడం వల్ల మలబద్దక సమస్య పూర్తిగా పోతుంది. గర్భిణీలు.. బాలింతలకు నీరసం ఉండదు. మధుమేహం వ్యాధిగ్రస్తులకు చక్కని ఆహారంగా ఉపయోగపడుతుంది.
సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల బీపీ రోగులు రోజు ఆహారంలో తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి.. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఆహారంలో కొంత తీసుకుంటే ఎంతో మంచిది. వీటిని ఆరగించడం వల్ల ఆకలి పెంచడమే కాకుండా డయేరియాను నివారిస్తుంది. ఈ గింజలు కొంతమందికి పడవు. ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరంగా అనిపించి, గ్యాస్ వచ్చే సూచనలుంటాయి. ఈ గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గే సూచనలున్నాయి.