మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 11 అక్టోబరు 2017 (14:54 IST)

జగపతిబాబు ఊర మాసా..? కాకా హోటల్లో ఏం చేశాడంటే?

విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న జగపతిబాబు తిరుపతిలో ఒక కాకా హోటల్లో భోజజం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అందులోను పూర్తి నాన్‌వెజ్ హోటల్లో మాస్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో జగపతిబాబు స్వయంగా వచ్చి కూర్చుని తినడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుత

విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న జగపతిబాబు తిరుపతిలో ఒక కాకా హోటల్లో భోజజం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అందులోను పూర్తి నాన్‌వెజ్ హోటల్లో మాస్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో జగపతిబాబు స్వయంగా వచ్చి కూర్చుని తినడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది.
 
ఒక ప్రైవేటు కార్యక్రమంలో హాజరయ్యేందుకు తిరుపతికి వచ్చిన జగపతి బాబు ఎవరికీ చెప్పకుండా నేరుగా కర్ణాల వీధిలోని శీనయ్య అనే హోటల్‌కు వెళ్ళి అక్కడ కూర్చుని భోజనం చేశాడు. శీనయ్య మెస్ నాన్‌వెజ్‌కు పెట్టింది పేరు. గతంలో తిరుపతికి వచ్చినప్పుడు కూడా జగపతిబాబు ఇక్కడే భోజనం చేసేవారట. అందుకే ఈ టేస్ట్ బాగా నచ్చి జగపతి బాబు ఇక్కడికి వచ్చారు. అంతేకాదు గతంలో తన స్నేహితుడు ఒకరు ఆ హోటల్‌ను చూపిస్తే అక్కడ భోజనం చేశా... చాలా బాగుందని చెప్పి ఇక ఎప్పుడు తిరుపతికి వచ్చినా ఆ హోటల్‌కే వెళ్ళేవారట.