సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (13:48 IST)

తిరుపతిలో నడిరోడ్డుపై వ్యక్తి హత్య (వీడియో)

తిరుపతిలో పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా నరికిచంపారు గుర్తుతెలియని వ్యక్తులు. పెద్దకాపు వీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్

తిరుపతిలో పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా నరికిచంపారు గుర్తుతెలియని వ్యక్తులు. పెద్దకాపు వీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న సత్యనారాయణను స్థానికులు గుర్తించి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సత్యనారాయణ మృతి చెందాడు. 
 
సత్యనారాయణ గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఒక ప్రైవేట్ లాడ్జిని నడుపుతున్నాడు. హత్యకు గల కారణాలపై  పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. నగరం నడిరోడ్డులో ఒక వ్యక్తిపై కత్తులతో దాడికి దిగి హత్య చేయడం సంచలనం రేపుతోంది. సత్యనారాయణకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. అప్పలాయగుంట సమీపంలోని యానాది కాలనీలో స్థలానికి చెందిన యానాదులతో సత్యనారాయణకు పాత కక్షలున్నట్లు సమాచారం.