శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (15:48 IST)

రేప్ చేశాడు.. ఇల్లును రాయించుకున్నాడు : తెలంగాణ మహిళ ఫిర్యాదు

ఢిల్లీలో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ మోసపోయింది. అత్యాచారానికి గురికావడమేకాకుండా, ఆస్తి కూడా పోగొట్టుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

ఢిల్లీలో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ మోసపోయింది. అత్యాచారానికి గురికావడమేకాకుండా, ఆస్తి కూడా పోగొట్టుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో సుభాష్ అనే యువకుడు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆ ఎస్టేట్‌లో తెలంగాణాకు చెందిన మహిళ పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెకు సుభాష్ మాయమాటలు చెప్పి లోబర్చుకుని తన కోర్కె తీర్చుకున్నాడు. ఆ తర్వాత 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆమె ఇంటిని కూడా రాయించుకున్నాడు. 
 
డబ్బులొస్తాయని ఆశగా ఎదురు చూసిన ఆమె నిలదీయడంతో అతను చేసిన మోసం వెలుగుచూసింది. దీంతో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వారిని వేడుకుంది. తనపై నాలుగు సార్లు అత్యాచారం చేసి, తన ఆస్తి రాయించుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.