గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (13:05 IST)

వర్షం పడుతుందని ఇంట్లోకి రమ్మన్నాడు.. వచ్చాక కరెంట్ కట్ చేసి.. అత్యాచారం చేశాడు..

మహిళలపై దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లుతున్నాయి. మహిళలు ఒంటరిగా వెళ్ళినా.. చివరికి భర్తతో వెళ్ళినా.. అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా వర్షం పడుతుంది. ఓ ఇంటి బయట నిలిచిన మహిళను లోపలికి పిలిచి మరీ

మహిళలపై దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లుతున్నాయి. మహిళలు ఒంటరిగా వెళ్ళినా.. చివరికి భర్తతో వెళ్ళినా.. అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా వర్షం పడుతుంది. ఓ ఇంటి బయట నిలిచిన మహిళను లోపలికి పిలిచి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లాకు చెందిన మహిళ (48) రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో నివాసం ఉండే తన కుమారుల వద్దకు వచ్చింది. మధ్యలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగివస్తుండగా..  వర్షం జోరుగా కురిసింది. దీంతో వర్షంలో తడవకుండా ఉండేందుకు ఒక ఇంటి ముందు నిల్చుంది.

ఆమె నిల్చున్న ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రాజు నాయక్ (23) అనే యువకుడు ఆమెను గిరిజన మహిళగా గుర్తించి.. ఇంట్లో వచ్చి కూర్చోమన్నాడు. ముందుగా కాస్త జంకిన మహిళ.. ఆపై గిరిజనులకు తెలిసిన భాషతో ఆమెను నమ్మించాడు. 
 
వర్షం తగ్గేవరకూ ఇంట్లో కూర్చుని వెళ్లిపోవచ్చని తన ఇంట్లోకి ఆహ్వానించాడు. సొంత భాషలో మాట్లాడడంతో ఆమె కూడా నమ్మి ఇంట్లోకి వెళ్లింది. కాసేపటి తరువాత తలుపులు మూసి, విద్యుత్ సరఫరా నిలిపేసిన ఆ యువకుడు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అరెస్టు చేశారు.