బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 9 అక్టోబరు 2017 (12:37 IST)

నువ్వు మా అమ్మవు... నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాం - నాగ్

మనం సినిమాలో నాగార్జున కుటుంబం మొత్తం కలిసి నటించింది. దివంగత ఎఎన్ఆర్ కూడా ఆ సినిమాలో నటించారు. అయితే సినిమాలో సమంత క్యారెక్టర్ హైలెట్, నాగార్జునకు తండ్రిగా నాగచైతన్య, తల్లిగా సమంత కనిపిస్తారు. ఆ సినిమా క్యారెక్టర్ కంటే నిజ జీవితంలో అలాగే ఉన్నారు నాగ

మనం సినిమాలో నాగార్జున కుటుంబం మొత్తం కలిసి నటించింది. దివంగత ఎఎన్ఆర్ కూడా ఆ సినిమాలో నటించారు. అయితే సినిమాలో సమంత క్యారెక్టర్ హైలెట్, నాగార్జునకు తండ్రిగా నాగచైతన్య, తల్లిగా సమంత కనిపిస్తారు. ఆ సినిమా క్యారెక్టర్ కంటే నిజ జీవితంలో అలాగే ఉన్నారు నాగ్ కుటుంబం. చైతు, సమంతలు ఇద్దరూ లవ్‌లో ఉన్నప్పటి నుంచే నాగార్జున, అమల కుటుంబ సభ్యులు పెళ్ళికి గ్రీన్ సిగ్న్ ఇచ్చేశారు. వివాహం కూడా జరిగిపోయింది. 
 
సమంత, నాగచైతన్యల వివాహం అతి తక్కువమంది బంధువులతో ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిగింది. తొలుత హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగితే ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో మాత్రం సమంత బోరున విలపించారు. కన్యాదానం జరిగే సమయంలో సమంత కంట కన్నీరు వచ్చింది. అంతకుముందు వరకు ఎంతో చలాకీగా ఫోటోలు తీసుకుంటూ నవ్వుతూ గడిపిన సమంత తాను మరొకరికి ఇంటికి వెళ్ళిపోతున్నానని తెలియడంతో కంట కన్నీరు ఆగలేదు. 
 
పక్కనే ఉన్న అమల, నాగార్జునలు ఏడవద్దమ్మా.. మేమున్నాముగా అంటూ గట్టిగా హత్తుకున్నారట. నీకు అండగా మేమున్నాం.. బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మా అమ్మవు అంటూ నాగార్జున, అమలలు చెప్పడంతో సమంతకు మళ్ళీ కన్నీళ్ళు ఆగలేదు. దాంతో నాగార్జున నిన్ను మా కంటి రెప్పలా చూసుకుంటామని సముదాయించారట.