శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (10:35 IST)

రింగులు మార్చుకున్న సమంత, చైతూ.. గోవాలో వివాహం (వీడియో)

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం నాడు పంచెకట్టులో నాగచైతన్య, పట్టు చీరలో తళుక్కుమంటూ సమంత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వేద మంత్రోచ

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం నాడు పంచెకట్టులో నాగచైతన్య, పట్టు చీరలో తళుక్కుమంటూ సమంత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వేద మంత్రోచ్చారణల మధ్య మూడుముళ్ల బంధంతో ఒకటై, ఆపై శనివారం నాడు సూటూ, బూటూ, బ్రైడల్ గౌన్ దుస్తులతో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకున్నారు.  
 
అయితే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం సమంత, చైతూ వివాహం ఎందుకు జరిగిందంటే? వాస్తవానికి సమంతది క్రిస్టియన్ కుటుంబం కావడంతో చైతూను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని సమంత చెప్పినప్పుడు తల్లిదండ్రులు అంగీకరించలేదట. అయితే సమంత కోసం ఒప్పుకున్న ఆమె తల్లిదండ్రులు.. తమ బిడ్డ వివాహం తమ సంప్రదాయంలో జరగాలని కోరారట. 
 
ఇందుకు నాగార్జున కూడా ఓకే చెప్పారట. అందుకే రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవాలని చైతూకు సూచించారట. దీంతో సమంత హ్యాపీగా ఫీలయ్యిందట. అలా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం సమ్మూ, చైతూ వివాహం జరిగిందని టాక్.