శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By tj
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2017 (17:54 IST)

శిలా మూర్తికి శిరసా నమామి..!

తిరుమల క్షేత్రం... కలియుగ వైకుంఠం. తిరుమల కొండల్లోని చెట్టూ, పుట్టా... రాయీ, రప్ప... ఆ స్వామివారి ప్రతి రూపాలే. తిరుమలకు వెళ్లేదారిలో స్వామివారి సహజ శిలా రూపం భక్తులను కటాక్షిస్తోంది.

తిరుమల క్షేత్రం... కలియుగ వైకుంఠం. తిరుమల కొండల్లోని చెట్టూ, పుట్టా... రాయీ, రప్ప... ఆ స్వామివారి ప్రతి రూపాలే. తిరుమలకు వెళ్లేదారిలో స్వామివారి సహజ శిలా రూపం భక్తులను కటాక్షిస్తోంది. నిలువెత్తు ఆ ముగ్ధమనోహర రూపం శ్రీవారి ప్రాశస్త్యాన్ని, తిరుమల కొండల్లోని ఆధ్యాత్మిక చింతనకు సజీవసాక్ష్యంగా నిలిచింది. శ్రీవారి భక్తాగ్రేసరుడు అన్నమయ్య స్తుతించిన "ఏడు కొండలా వాడా ఎక్కడున్నావయ్యా... ఎన్నీ మెట్లెక్కినా కానారావేమయ్యా" కీర్తనకు మెచ్చిన తిరుమలనాథుడు ఏడుకొండల్లో సహజ శిలారూపం ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు.
 
అందుకే అన్నారేమో... ఆ కలియుగ దేవున్ని అడుగడుగు దండాల వాడా వేంకటేశ్వర అని.
 
తిరుమల కొండపై రెండో ఘాట్‌రోడ్డు చివరిమలుపు వద్ద శ్రీవారి రూపంలో ఉన్న సహజ శిలాకృతికి తిరుమల స్థానికులు అభిషేకం చేసి, నైవేద్యం సమర్పించారు. తిరుమలకు చెందిన యువ భక్తులు కొందరు శ్రీవారి శిలారూపానికి పూజలు చేశారు. పాలు, పెరుగు, పసుపు, కుంకుమ కలిపిన నీటితో తిరుమంజనం చేశారు. భారీ తులసి మాలలను అలంకరించారు. ఘాట్ రోడ్డు మీదుగా తిరుమలకు వెళ్ళే భక్తులు శిలామూర్తికి జరిగిన అభిషేకాన్ని తిలకించారు.