మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలను సమర్ధంగా నడిపిస్తారు. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. దైవ ఉత్సవ సమావేశంలో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ రోజు కలిసివచ్చే సమయం. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఖర్చులు అధికం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు కొనసాగించండి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. అభియోగాలు ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పనులు ముందుకు సాగవు. పెద్దలను సంప్రదిస్తారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియచేయండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త, ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్ధతను చాటుకుంటారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతగా మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి పెడతారు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పనులు వాయిదా వేసుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. అనవసర జోక్యం తగదు. ఆత్మీయులను కలుసుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు సామాన్యం. రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు. గృహం ప్రశాంతంగాఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లతో మనస్థిమితం ఉండదు. సన్నిహితులు సాయం చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏకాగ్రతతో పనిచేయండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఖర్చులు అధికం. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
స్థిరచరాస్తుల ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు.