మంగళవారం, 27 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (11:22 IST)

వంకాయలతో మేలెంత.. బరువు తగ్గాలనుకునేవారు..

బరువు తగ్గాలనుకునేవారు వంకాయ కూరలను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వంకాయలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వంకాయలో ఐరన్‌కు తగినట్లు కాపర్‌ ఉంటుంది. ఎర్ర రక్తకణా

బరువు తగ్గాలనుకునేవారు వంకాయ కూరలను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వంకాయలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వంకాయలో ఐరన్‌కు తగినట్లు కాపర్‌ ఉంటుంది. ఎర్ర రక్తకణాలు తగిన సంఖ్యలో ఉండాలంటే ఐరన్ అత్యవసరం. 
 
ఇవి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని మెదడుకు అందించడంలో సహకరిస్తాయి. వంకాయలో సొల్యుబుల్‌ ఫైబర్‌ అనేది రక్తంలోకి చక్కెర తగిన విధంగా విడుదలయ్యేందుకు దోహదపడుతుంది. అందుకే వంకాయ డయాబెటిస్‌ రోగులకు మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
వంకాయలో విటమిన్-సి పాళ్లు కూడా ఎక్కువే. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు పలు రకాల క్యాన్సర్లను నివారించటంలో దోహదపడతాయి. దీనిలోని ఫైటోన్యూట్రియెంట్లు మెదడును చురుగ్గా ఉంచుతాయి. వంకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ మెదడుకి పోషణ అందిస్తాయి. వంకాయలో క్యాలరీలే ఉండవు. 
 
అలాగే ఫ్యాట్ ఫ్రీగా ఉంటుంది. అంతేకాదు వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వంకాయని తరచుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.