సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (10:35 IST)

చికెన్, కోడిగుడ్డును ఫ్రిజ్‌లో పెట్టి హీట్ చేసుకుని తింటున్నారా?

ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసుకుని తీసుకునే ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే చికెన్ రీహీట్ చేసుకుని తినకూడదు. చికెన్‌లో ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయి. దీన్ని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల జీర్ణ

ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసుకుని తీసుకునే ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే చికెన్ రీహీట్ చేసుకుని తినకూడదు. చికెన్‌లో ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయి. దీన్ని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి చికెన్ ఎప్పుడూ వేడిచేయకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
అలాగే కోడిగుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా వుంటాయి. ఉదయాన్నే వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దీన్ని మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. కోడిగుడ్లను రీహీట్ చేయడం ద్వారా టాక్సిక్‌లా మారిపోయి.. జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపుతాయి. బచ్చలికూరలో ఐరన్, నైట్రేట్లు పుష్కలంగా వుంటాయి. దీన్ని ఎప్పుడైనా రీహీట్ చేస్తే అందులో వుండే నైట్రేట్స్ నైట్రిట్స్‌లా మారిపోతాయి. 
 
కాబట్టి బచ్చలికూరను అస్సలు రీహీట్ చేసి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మష్రూమ్స్‌లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని వండిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా వేడిచేయకూడదు. బంగాళాదుంప రీహెట్ చేయకూడదు. ఇది టాక్సిక్ ఫుడ్. వీటిని వేడిచేయడం వల్ల అందులో ఉండే పోషక విలువలు కోల్పోతాయి. బంగాళదుంపలను ఎప్పుడూ ఉడకబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.