శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (13:00 IST)

ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే..?

ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి. రాత్రి నిద్రించే ముందు కలబంద గుజ్జును ముఖానికి రాసుకుని మర్దన చేసి నిద్రించాలి. మరుసటి రోజు గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం ద్

ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి. రాత్రి నిద్రించే ముందు కలబంద గుజ్జును ముఖానికి రాసుకుని మర్దన చేసి నిద్రించాలి. మరుసటి రోజు గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం ద్వారా మచ్చలు పోతాయి. 
 
కళ్లద్దాల తాలూకు మచ్చల్ని పోగొట్టుకోవాలంటే టమోటాలు బాగా ఉపయోగపడతాయి. ఈ ముక్కల్ని మెత్తగా చేసి ఆ గుజ్జును మచ్చల మీద పూతలా వేయాలి. తర్వాత కడిగేస్తే అవి క్రమంగా తగ్గిపోతాయి. అలానే టమోటా రసంలో కీరా, బంగాళాదుంప రసాలు కలిపి రాసుకున్నా ఆ మచ్చల్ని పోగొట్టవచ్చు. 
 
సహజ బ్లీచింగ్‌ గుణాలు నిమ్మరసంలో అధికం. నాలుగు చెంచాల నిమ్మరసంలో అరచెంచా నీళ్లు కలిపి అందులో దూది ఉండల్ని వేయాలి. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీశాక ఆ ఉండల్ని ముక్కు మీద మచ్చలున్నచోట, కళ్ల అడుగున రాసుకోవాలి. కాసేపటికి చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. 
 
కీరా రసాన్ని మచ్చలున్న చోట రాసుకోవాలి. లేదంటే దూదిని ముంచి అక్కడ కాసేపు పెట్టుకున్నా చాలు ఆ ప్రభావం మచ్చల మీద పడి త్వరగా పోతాయి. టమాటో కళ్లద్దాల తాలూకూ మచ్చల్ని పోగొట్టడానికి టొమాటోలు చక్కగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.